డిగ్రీ పూర్తి చేసి ఉండి ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ స్థాయిలో 17,727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి విడుదల కావడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భారత దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన , భారత దేశ పౌరులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు 24 జూన్ 2024 నుండి 24 జులై 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమీషన్
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 17,727 పోస్టులు
అర్హతలు : ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి.
వయసు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు కనీసం 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల లోపు ఉండాలి , ఎస్టీ, ఎస్సి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, దివ్యంగులకు పది సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్షా నిర్వహిస్తారు. అందులో పాస్ అయినవారికి ఇంటర్వ్యూ చేస్తారు.
పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్టాలలో చీరాల, గుంటూరు , కాకినాడ, కర్నూల్, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లలో పరీక్షా నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి, ఇందులో ఎస్టీ, ఎస్సి, మహిళలు, దివ్యంగులు, మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 24 జూన్ 2024
దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ : 24 జులై 2024
You have noted very interesting details! ps nice internet site.Blog money