తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు చేసే మహిళా అభ్యర్థులకు ఆ రాష్ట్ర మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త తెలియజేయడం జరిగింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడి సహాయక ఉద్యోగాలు చేస్తున్న మహిళా అభ్యర్థులు 65 సంవత్సరాలు దాటి రిటైర్ అయ్యే వాళ్ళకి అంగన్వాడీ టీచర్లకు ప్రస్తుతం ఒక లక్ష రూపాయలు ఇస్తూ ఉండగా దానిని రెండు లక్షలకు పెంచుతున్నామని తెలియజేశారు. అలాగే అంగన్వాడి సహాయకుడు ఉద్యోగం చేసే మహిళలకు రిటైర్ అయ్యే వారికి గతంలో 50 వేల రూపాయలు ఇస్తూ ఉండగా దానిని లక్షకు పెంచి ఇస్తామని తెలియజేశారు.
ఈ మేరకు ఈ పెంపు ప్రక్రియకు సంబంధించి ప్రతిపాదనలను ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖకు పంపినట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తొమ్మిది వేలకు పైన అంగన్వాడీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేశారు