రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేవలం పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ అర్హతతో రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 15 ఆగస్టు 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదవగలరు లేదా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాలు వివరాలు:- రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ రైల్వే భారతదేశంలోని వివిధ వర్క్ షాపులు మరియు యూనిట్లలో ఖాళీగా ఉన్నటువంటి ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 2424 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల అయింది ఈ ఉద్యోగాలు కేవలం ఒక్క సంవత్సరం కాంట్రాక్టు పద్దతిలో మాత్రమే భర్తీ చేస్తారు
విభాగాల వారీగా ఉద్యోగాలు వివరాలు :- ఎలక్ట్రిషన్, పెయింటర్, టైలర్, డీజిల్ మెకానిక్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్, వెహికల్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టం మెయింటెనెన్స్, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్ తదితర అప్రెంటిస్ విభాగాలు ఉన్నాయి
విద్యార్హతలు:- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వివిధ ట్రైడ్లకు సంబంధించి పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి దాంతోపాటు సంబంధిత ట్రేడ్ లో కనీసం 50% మార్కులతో ఐటిఐ పాస్ అయి ఉండాలి
వయసు పరిమితి :-ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 15 జూలై 2024 నాటికి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు ఉంచకుండా ఉండాలి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు వయసు పరిమితులు సడలింపు ఉంటుంది
దరఖాస్తు విధానం :-ఆసక్తి మరియు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు వంద రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి . ఎస్టీ, ఎస్టీ, వికలాంగులు అలాగే మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు
ముఖ్యమైన తేదీల వివరాలు :-ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15 ఆగస్టు 2024