పదవ తరగతి ఇంటర్మీడియట్ మరియు ఐటిఐ పూర్తి చేసి ఉండి రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెంట్రల్ రైల్వే స్కౌట్స్ మరియు గైడ్స్ కోటాలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పదవ తరగతి ఇంటర్మీడియట్ మరియు ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 28 ఆగస్టు 2024 లోపు ఆన్లైన్ ద్వారా తెలుసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదవగలరు. లేదా క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు :: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇందులో లెవెల్ -1 లో రెండు, లెవెల్-2లో ఉద్యోగాలు 10 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హతలు:: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యార్హతలు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అభ్యర్థులు ఉద్యోగాలను అనుసరించి పదవ తరగతి ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ అర్హతలు కలిగి ఉండాలి.
వయస్సు పరిమితి:: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 1 జులై 2024 నాటికి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు పెంచకుండా ఉండాలి అలాగే రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వారి యొక్క రిజర్వేషన్లను బట్టి మూడు సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వయసు పరిమితులు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానము :: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పాస్ అయిన వారికి ప్రాక్టికల్ టెస్ట్ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
దరఖాస్తు విధానము:: ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న 10వ తరగతి ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ పాసైన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజును కూడా చెల్లించవలసి ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ మరియు వికలాంగ అభ్యర్థులు మహిళలు మైనారిటీలకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలు. మిగిలిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 400 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీల వివరాలు:: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 29 జూలై 2024 నుంచి ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తిది 28 ఆగస్టు 2024 సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.