పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాల కు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ మరియు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 19 ఆగస్టు 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి ఈ ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదవగలరు లేదా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు:: పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మొత్తం 18 ఉద్యోగాలలో విభాగాల వారీగా ఖాళీల వివరాలు చూసినట్లయితే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఆరు ఉద్యోగాలు పెరీమీటర్ సెక్యూరిటీ ఆరు ఉద్యోగాలు ఎండ్ పాయింట్ సెక్యూరిటీ ఆరు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హతలు:: పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలోని ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు కలిగి ఉండాలి వివిధ ఉద్యోగాలకు వివిధ అర్హతలను నిర్ణయించారు అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ లేదా ఎం ఈ, ఎంటెక్ పాసై ఉండాలి
వయస్సు పరిమితి:: పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి విడుదలైన ఈ నోటిఫికేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 1 జులై 2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి అలాగే రిజర్వేషన్ వర్గాల వారికి మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది
ఎంపిక విధానము:: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ ఉద్యోగాలకు అధిక సంఖ్యలో దరఖాస్తుల వచ్చినట్లయితే రాత పరీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉంది
దరఖాస్తు విధానము:: ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 19 ఆగస్టు 2024 సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు