నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు అన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే భర్తీ చేస్తారు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ , రాజేంద్రనగర్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ కార్యాలయంలో పనిచేయవలసి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు మొత్తం 17 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో అకాడమిక్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ మరియు డేటా అనలిస్ట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యార్హతలు :: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ శాఖ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఉద్యోగాలను అనుసరించి వివిధ అర్హతలను నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలను తెలుసుకోవచ్చు.
వయస్సు పరిమితి :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు పరిమితి కనీసం 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానము :: ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా జనరల్ ఓబీసీ మరియు ఈ డబ్ల్యూ అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఇందులో ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీల వివరాలు :: దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 ఆగస్టు 2024 కాబట్టి అర్హతలు ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.