కడప జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కడప జిల్లా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ నందుగల ట్రియో విజన్ కాంపోజిట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తి అర్హతలు గల నిరుద్యోగ పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేసుకుంటారు కాబట్టి అర్హతలు కలిగిన కడప జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో నేరుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
విద్యార్హతలు:- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు పదవ తరగతి ఐటిఐ ఇంటర్మీడియట్ డిప్లమా మరియు డిగ్రీ పాసైన లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
వయస్సు పరిమితి:- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి
జీతభత్యాలు:- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 11వేల రూపాయల వేతనంతో పాటు ఓటీ + ఆహారము మరియు బోనస్ తదితర అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు విధానము ఆసక్తి మరియు అర్హతలు కలిగిన కడప జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కులో గల ట్రయోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కంపెనీలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు వివరాలకు 8919993254 లేదా 9281010090 అనే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు