అనంతపురము మరియు శ్రీ సత్య సాయి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు గమనిక. జిల్లా ఉపాధి కల్పనాధికారి గారి కార్యాలయము, కోర్ట్ రోడ్, అనంతపురము జిల్లా వారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ కలిగివున్న నిరుద్యోగ యువతీ యువకులకు Joyalukkas India Ltd కంపెనీలో Senior Executive, Sales Trainee ఉద్యోగాలకు 02-08-2024 తేదీ ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కల్పనాఅధికారి గారి కార్యాలయము నందు ఉద్యోగ మేళా నిర్వహించబడును.
వయసు పరిమితి :: Senior Executive ఉద్యోగానికి 18 సంవత్సరముల నుండి 28 సంవత్సరములలోపు వయసు కలిగి ఉండి jewelry sales లో అనుభవం కలిగి ఉండవలెను. Senior Trainee ఉద్యోగానికి 18 సంవత్సరముల నుండి 26 సంవత్సరములలోపు వయసు కలిగి ఉండవలెను.
దరఖాస్తు విధానం :: అర్హత మరియు ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు తమ బయో డేటా ఫారము మీ విద్యార్హతలు ఒరిజినల్ మరియు జిరాక్స్ పత్రములు, డ్రైవింగ్ లైసెన్సు లేదా ఏదైనా ID ప్రూఫ్ తో పాటు జిల్లా ఉపాధి కార్యాలయము, కోర్ట్ రోడ్, అనంతపురములో జరుగు జాబ్ మేళాకు పైన తెలిపిన తేదీలలో ఉదయం 09:30 గంటలకు హాజరు అయ్యి తమ వివరాలు నమెదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి శ్రీమతి ఏ.కళ్యాణి గారు తెలియజేయుచున్నారు.
అధిక వివరాల కొరకు 08554-245547 నంబరును సంప్రదించగలరు.