కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ టాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ తన హైదరాబాద్ జోన్లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ టాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ నందు పని చేయవలసి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆసక్తి మరియు అభ్యర్థులు ప్రతి ఒక్కరు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ పూర్తిగా చదవగలరు. అలాగే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు 19 ఆగస్టు 2024 లోపు దరఖాస్తు ఈ క్రింద తెలిపిన అడ్రస్ కు పోస్టు ద్వారా తమ దరఖాస్తులను పంపించవలసి ఉంటుంది.
ఉద్యోగాలు వివరాలు : ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇందులో టాక్స్ అసిస్టెంట్ ఏడు పోస్టులు , స్టెనోగ్రాఫర్ ఒక పోస్టు, హవల్దార్ 14 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఉద్యోగాలను అనుసరించి పదవ తరగతి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పాసైన అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
వయస్సు పరిమితి: ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు వయస్సు 19 ఆగస్టు 2024 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే 19 ఆగస్టు 2024 నాటికి గరిష్టంగా 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానము ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు రాత పరీక్ష నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు విధానము: ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసిన అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి తగు విద్యార్హత పత్రాలను జతపరిచి వాటిని క్రింద తెలిపిన చిరునామాకు అభ్యర్థులు తమ అప్లికేషన్లను పంపించడానికి చివరి తేదీ 19 ఆగస్టు 2024
Address : The Additional Commissioner (CCA) , O/o The Principal Commissioner of Central Tax, Hyderabad, GST Bhavan, L.B.Stadium Road, Basheerbagh , Hyderabad 500004.