ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 1,11,000 పైగా వేతనం అందుకోవడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ డిగ్రీ పాసైన ప్రతి ఒక అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. దాంతోపాటు ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అధ్యక్షులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు 16 ఆగస్టు 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదవగలరు లేదా క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా 15 సైంటిస్ట్ బి గ్రేడ్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది
విద్యార్హతలు :: ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
వయస్సు పరిమితి :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు వయస్సు కనీసం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ప్రభుత్వాన్ని నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయస్సు పరిమితులు సడలింపు ఉంటుంది
దరఖాస్తు విధానము:: ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16 ఆగస్టు 2024