ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్వతిపురం ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ చదవగలరు లేదా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఉద్యోగాలు వివరాలు:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషన్, వెల్డర్, డ్రాఫ్ట్ మెన్, ఫిట్టర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు విద్యార్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పార్వతిపురం విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉండాలి అభ్యర్థులు పదవ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటిఐ పాసై ఉండాలి.
వయస్సు పరిమితి:: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి రిజర్వేషన్ బట్టి ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , బిసి అభ్యర్థులకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయసు పరిమితిలో సడలింపు ఉంటుంది
దరఖాస్తు ఫీజు:: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో 118 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించి రసీదు పొంది దానిని దరఖాస్తులతో జతపరిచి అందజేయవలెను
ఎంపిక విధానము:: ఆసక్తి మరియు అర్హతలు కలిగిన పార్వతీపురం విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో చెందిన నిరుద్యోగ అభ్యర్థులు 16 ఆగస్టు 2024 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకొని 22 ఆగస్టు 2024 పార్వతీపురం మన్యం జిల్లా అభ్యర్థులు 23 ఆగస్టు 2024 విజయనగరం జిల్లా అభ్యర్థులు 27 ఆగస్టు 2024 శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులు క్రింద తెలిపిన అడ్రస్ లో జరిగే ఇంటర్వ్యూలకు డైరెక్ట్ గా హాజరు కావచ్చు
ఈ ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం కోసం 08922-294906 అనే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు