ఆంధ్ర ప్రదేశ్ లోని మహిళా నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ వన్ స్టాప్ సెంటర్ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ బాపట్ల జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బాపట్ల జిల్లాలో ఉన్న వివిధ వన్ స్టాప్ సెంటర్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు అన్ని కాంట్రాక్టు పైన భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు వయస్సు మరియు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తదితర వివరాలు తెలుసుకోవడానికి క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా చదవగలరు లేదా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 6 ఆగస్టు 2024
ఉద్యోగాల వివరాలు :: ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా బాపట్ల జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్లలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఒక పోస్టు, కేస్ వర్కర్ ఒక పోస్టు, పారా లీగల్ లాయర్ ఒక పోస్టు, పారామెడికల్ పర్సనల్ ఒక పోస్టు, మల్టీపర్పస్ స్టాప్ రెండు పోస్టులు, సెక్యూరిటీ గార్డు లేదా నైట్ గార్డు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు
విద్యార్హతలు :: బాపట్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ఉద్యోగాలను అనుసరించి వివిధ అర్హతలను నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ముందు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని తమ అర్హతలను చెక్ చేసుకోవచ్చు
వయస్సు పరిమితి : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు వయస్సు 1 జులై 2024 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి అలాగే రిజర్వేషన్ వర్గాల వారికి ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు మరియు బీసీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వరకు వయస్సు పరిమితులు సదలింపు ఉంటుంది
జీతభత్యాలు : ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వారి యొక్క పోస్టును బట్టి జీతం 15 వేల రూపాయల నుంచి 34 వేల రూపాయల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానము : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారు ముఖ్యమైన తేదీల వివరాలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 6 ఆగస్టు 2024
దరఖాస్తు విధానము : ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేసిన తర్వాత తగు విద్య పత్రాలను జతపరిచి ఆరు ఆగస్టు 2024 లోపు బాపట్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారి, కేరాఫ్ బాలసదనం, అక్బర్ పేట, అగ్నిమాపక దళ కార్యాలయం పక్కన, బాపట్ల జిల్లా – 522101 అనే చిరునామాలు స్వయంగా అందజేయాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు