చిత్తూరు జిల్లా శ్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుంచి చిత్తూరు జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నందు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లను ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 10 ఆగస్టు 2024 లకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక విధానము అర్హతలు మరియు ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదవగలరు. లేదా క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు : చిత్తూరు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎనిమిది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో డిస్టిక్ కోఆర్డినేటర్ 1 ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒకటి మరియు బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ 6 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హతలు :: చిత్తూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఈ ఉద్యోగాలకు ఉద్యోగాలను అనుసరించి వివిధ అర్హతలను నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని విద్యార్హతలను చెక్ చేసుకోవచ్చు.
వయస్సు పరిమితి :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం ఒకటి జూలై 2024 నాటికి 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలి.
జీతభత్యాలు :: చిత్తూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ అభ్యర్థులకు డిస్టిక్ కోఆర్డినేటర్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు 30 వేల రూపాయలు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18 వేల రూపాయలు బ్లాక్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20 వేల రూపాయలు వేతనంగా ఇవ్వడం జరుగుతుంది..
ఎంపిక విధానము :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట కంప్యూటర్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఎంపిక చేసి వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇందులో ఉత్తీర్లైన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారు.
దరఖాస్తు విధానము :: ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ అప్ చేసిన తర్వాత తగు విద్యార్హత పత్రాలు జతపరిచి జిల్లా స్త్రీ మరియు తీసుకు సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయము రెండవ అంతస్తు, అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ చిత్తూరు జిల్లా నందు అభ్యర్థుల స్వయంగా 10 ఆగస్టు 2024 సాయంత్రం ఐదు గంటల లోపు తమ దరఖాస్తులను అందజేయవలెను