ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ నియామక ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు కూటమి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రస్తుతం 19,999 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తదుపరి వివరాలు సేకరించి ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తే అవకాశముంది.
గత ప్రభుత్వం ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 28 నవంబర్ 2022న 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షకు 4,58,219 మంది హాజరు కాగా ఇందులో 95,208 మంది క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత మార్చి 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించి షెడ్యూల్ ప్రకారం దాన్ని పూర్తి చేయాల్సి ఉండగా అదే సమయంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు ఉండడంతో వాటిని వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో కోర్టులో ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు కేసులు దాఖలు చేయడంతో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. కాగా కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిజిపి సిహెచ్ ద్వారకా తిరుమలరావు మరియు పోలీసు నియాత్మక మండలి చైర్మన్ రామకృష్ణ గారితో ఈ విషయమై పలుమార్లు సమీక్షలు జరపడం జరిగింది.
కాగా తాజా పరిణామాల నేపథ్యంలో గతంలో విడుదల చేసిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు తోడు మరో 13,899 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పోలీస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో మొత్తం 19,999 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తే అవకాశం ఉంది.
-
BPCL Graduate Apprentices Jobs | Apply Now BPCL Jobs
Share This Job Post Views: 37 Bharat Petroleum Corporation Limited,Read More
-
Jobs in Government Hospital | BECIL Recruitment 2024
Share This Job Post Views: 32 Broadcast Engineering Consultants IndiaRead More
-
Agricultural Jobs | 2024 Teaching Jobs in Nellore NG Ranga Agricultural University
Share This Job Post Views: 35 Acharya N.G. Ranga AgriculturalRead More
-
Indian Army Jobs 2024 | Join indian army Technical Graduate Course TGC – 141
Share This Job Post Views: 38 The Indian Army ApplicationsRead More
-
SSC Constable Recruitment 2024 | 39481 Constable Jobs
Share This Job Post Views: 43 Ministry of Home Affairs,Read More
-
Vizag Steel Plant Jobs 2024 | Apprentices Jobs in Steel Plant
Share This Job Post Views: 56 Rashtriya Ispat Nigam Limited,Read More