ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మారక ఉద్యోగం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి విడుదల కావడం జరిగింది. ఇందులో మొత్తం 12 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి అర్హతలు కలిగిన అభ్యర్థులు 6 ఆగస్టు 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు, ఎంపిక విధానము, వయస్సు వివరాల కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ పూర్తిగా చదవగలరు. అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి విడుదలైన ఈ మొత్తం 12 ఉద్యోగాలు కేవలం కాంట్రాక్టు పద్ధతిలో మాత్రమే భర్తీ చేయనున్నారు ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు అయితే కాదు.
ఉద్యోగాల వివరాలు : ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానంలోని జడ్జిలకు సేవలు అందించడం కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో లా క్లర్కుల ఉద్యోగాలను బట్టి చేయడానికి ఈ నోటిఫికేషన్లు అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 లా క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాసై ఉండి తర్వాత ఐదు సంవత్సరాలు రెగ్యులర్ విద్యను అభ్యసించి లేదా ఇంటర్మీడియట్ తర్వాత రెగ్యులర్ కరికులం డిగ్రీ విద్యను అభ్యసించి లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ పట్టా పొంది ఉండాలి లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాల నుంచి అయినా మూడు సంవత్సరాల రెగ్యులర్ లా డిగ్రీ పాసై ఉండాలి
జీతభత్యాలు : ఈ నోటిఫికేషన్ లోని లా క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు గౌరవ వేతనం కింద 35 వేల రూపాయలు చెల్లించడం జరుగుతుంది.
వయస్సు పరిమితి : ఆంధ్ర ప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్టంగా 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానము : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా తమ విద్యార్హతలను చెక్ చేసుకోవాలి ఆ తర్వాత క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉన్న దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసిన దరఖాస్తు ఫారం ను ఫిలప్ చేసిన తర్వాత తగు విద్యార్హత పత్రాలను జతపరిచి వాటిని ద రిజిస్టర్, హైకోర్టు ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, అమరావతి, నేలపాడు గుంటూరు జిల్లా – 522239, ఆంధ్ర ప్రదేశ్ అనే చిరునామాకు రిజిస్టర్ పోస్టు ద్వారా మాత్రమే పంపాలి
ముఖ్యమైన తేదీల వివరాలు:
అప్లికేషన్లు ప్రారంభం అయ్యే తేదీ 25 జూలై 2024
రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లికేషన్లు చేయడానికి చివరి తేదీ 6 ఆగస్టు 2024