నిరుద్యోగులకు శుభవార్త రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే నుంచి భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది ద్వారా రైల్వే శాఖలో 7951 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల వివరాలు అర్హతలు ఫీజు ఎంపిక విధానం తదితర వివరాల కోసం క్రింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చదివి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
రైల్వే శాఖ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7951 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇందులో కెమికల్ సూపర్వైజర్ మెటలర్జికల్ సూపర్వైజర్ 17 పోస్టులు ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపర్వైజర్ మరియు కెమికల్ మరియు మెటలర్జికల్ అసిస్టెంట్ 7934 పోస్టులు ఉన్నాయి
విద్యార్హతలు: ఈ ఉద్యోగాలకు సంబంధించి డిప్లమా డిగ్రీ మరియు బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
వయస్సు పరిమితి : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయస్సు పరిమితులు సడలింపు ఉంటుంది
రైల్వే నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజుగా ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులు ట్రాన్స్ జెండర్ మరియు మైనార్టీలు మరియు ఈ బి సి కేటగిరి అభ్యర్థులకు 250 రూపాయలు మిగతా అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి
ఎంపిక విధానము: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట కంప్యూటర్ టెస్ట్ నిర్వహిస్తారు అందులో పాసైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారు