ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారిన తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో వివిధ వాగ్దానాలను ఇచ్చింది అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించి మెగా డీఎస్సీ అలాగే వృద్ధులకు సంబంధించి పింఛన్లు మరియు రాష్ట్ర ప్రజలు ఆందోళన కలిగించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తో పాటు చంద్రన్న బీమా తో పాటు మరికొన్ని హామీలను నెరవేర్చింది వీటితోపాటు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మరియు అన్న క్యాంటీన్ లో ఏర్పాటు లాంటి మరెన్నో హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల సమయంలోనిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించి ఒక హామీను ఇవ్వడం జరిగింది. అది నిరుద్యోగ భృతి.
చదువుకుని ఉద్యోగం రాక ఖాళీగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించి అప్లికేషన్ల ఫీజు మరియు పరీక్ష ఫీజు తదితర అవసరాల నిమిత్తం ప్రభుత్వం వారికి ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో ఆమెని ఇచ్చింది ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా ఒక అధికారిక వెబ్సైట్ యువ నేస్తం అనే పేరుతొ రూపొందించింది
అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఈ పథకానికి సంబంధించి కొన్ని విధి విధానాలను రూపొందిని రూపొందించినట్లు తెలుస్తోంది అవి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని నిరుద్యోగ యువతీ యువకులకు 35 సంవత్సరాలు వయస్సు మించకుండా ఉండాలి అలాగే అభ్యర్థి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తో కనెక్ట్ అయి ఉండాలి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థికి కచ్చితంగా బర్త్ సర్టిఫికెట్ లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కలిగి ఉండాలి తాజాగా తీయించుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం అభ్యర్థి ఒక రేషన్ కార్డ్ మరియు బ్యాంక్ పాస్బుక్ కలిగి ఉండాలి
నిరుద్యోగ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించాలి అని ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ యువ నేస్తం అనే మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతికి సంబంధించి ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు యువ నేస్తం అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వెబ్సైటు ప్రస్తుతం పని చేయడం లేదు కాబట్టి అభ్యర్థులు తమ దగ్గరలోని వార్డు లేదా గ్రామ సచివాలయాలలో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ గా మారాయి