డిగ్రీ పాసై ఉండి బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదల కావడం జరిగింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేస్తూ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 21 ఆగస్టు 2024న చివరి తేదీగా నిర్ణయించారు.
ఉద్యోగాల వివరాలు :: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామీణ బ్యాంకులలో ప్రొఫెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 4455 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు.
విద్యార్హతలు:: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
వయస్సు పరిమితి :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి 01/08/ 2024 నాటికి కనీస వయసు 20 సంవత్సరాలు ఉండాలి. అలాగే గరిష్టంగా 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఇక రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వాన్నిబంధనల ప్రకారం వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది
ఎంపిక విధానము :: ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత అభ్యర్థులకు వైద్య పరీక్ష నిర్వహించి చివరగా ఇంటర్వ్యూ చేసి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
దరఖాస్తు విధానము:: ఆసక్తి మరియు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఇండియన్ బ్యాంకింగ్ సెలక్షన్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థి దరఖాస్తు ఫీజులు కూడా చెల్లించవలసి ఉంటుంది. ఇందులో జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 850 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ మరియు వికలాంగ అభ్యర్థులు 175 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీల వివరాలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ ఒకటి ఆగస్టు 2024. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 21 ఆగస్టు 2024. ఈ ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించే తేదీ అక్టోబర్ లో ఉంటుంది.